ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రము గా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా శుక్రవారం అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణములో పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పారు.