డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ జయంతిని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. వైసీపీ జిల్లా ఎస్. సి విభాగం అధ్యక్షులు బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఎల్ ఐసీ బిల్డింగ్ జంక్షన్ డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూ రావు, శాసనమండలి సభ్యురాలు, వరుదు కళ్యాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు.