విశాఖ: కేజీహెచ్ అభివృద్ధికి నిరంతరం కృషి

52చూసినవారు
విశాఖ: కేజీహెచ్ అభివృద్ధికి నిరంతరం కృషి
విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్‌లోని గైనకాలజీ ప్రసూతి, జనన ధృవీకరణ కేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమీషన్, శిశు సంరక్షణ విభాగం చేసిన అభ్యర్థన మేరకు ఈ కేంద్రాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. పుట్టిన ప్రతి బిడ్డకు గుర్తింపు అనేది ఒక ప్రాథమిక హక్కు ఈ గుర్తింపునకు ముఖ్య ఆధారం జనన ధృవీకరణపత్రమని తెలిపారు.

సంబంధిత పోస్ట్