విశాఖ: పల్లాకు కేకే రాజు పరామర్శ

50చూసినవారు
విశాఖ: పల్లాకు కేకే రాజు పరామర్శ
గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా సింహాచలం మృతి పట్ల విశాఖ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె. కె. రాజు నివాళులర్పించారు. సింహాచలం కుమారుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును సీతమ్మపేటలోని ఆయన నివాసంలో కె. కె. రాజు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా పల్లా సింహాచలం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తిప్పల దేవన్ రెడ్డి, అల్లు శంకర్రావు, అనిల్ కుమార్ రాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్