ఈ నెల 20న దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా విశాఖ జిల్లాలో ఆటోలు, వ్యాన్ల బంద్‌ను విజయవంతం చేయాలని ఆటో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. వామన మూర్తి డ్రైవర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు, వ్యాన్లను నిలిపివేసి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆర్టీసీ ఇన్ గేటు వద్ద ఆటో డ్రైవర్లు ప్రచార కార్యక్రమం నిర్వహించారు.