విశాఖ: చిన్నారితో సహా తల్లి అదృశ్యం

79చూసినవారు
విశాఖ: చిన్నారితో సహా తల్లి అదృశ్యం
విశాఖలోని ఐటీఐ కూడలి తుమ్మడపాలెంలో పాడి రోహిణి అనే వివాహిత తన రెండేళ్ల పాపతో అదృశ్యమైంది. మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకోగా భర్త ఓ దుకాణంలో పని చేస్తున్నాడు. ఈ నెల 13న ఉదయం భర్త దుకాణానికి వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చేసరికి ఇంట్లో ఇద్దరూ లేకపోవడంతో చుటుపక్కల, తెలిసిన వారిని అడిగిన ఆచూకీ లేకపోవడంతో సోమవారం కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్