విశాఖ: అలరించిన హిందీ పాటల విభావరి

74చూసినవారు
విశాఖ: అలరించిన హిందీ పాటల విభావరి
హిందీ పాటల ప్రియులను అలరించేలా విశాఖ ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో సోమవారం సాయంత్రం 'గీత్ సంగీత్' సంస్థ హిందీ సినీ గీతాల విభావరిని నిర్వహించింది. సంస్థ వ్యవస్థాపకుడు మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో నగరానికి చెందిన గాయనీ గాయకులు హిందీ పాటలు ఆలపించారు. క్రెడాయ్ చైర్మన్ ధర్మేందర్ వరద, కళా రంగ ప్రముఖులు సన్ మూర్తి, దాడి సత్యనారాయణ, ఫని స్వామి, వర్రె నాంచారయ్య తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్