వైసిపి విశాఖ జిల్లా విస్తృతస్థాయి సమావేశం శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు రిషికొండలోని ఏవన్ గ్రాండ్ హోటల్ లో నిర్వహించినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తెలిపారు. శుక్రవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కార్యక్రమానికి శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ , ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కొరసాల కన్నబాబు ఎంపీ గొల్ల బాబురావు, పార్టీ శ్రేణులు పాల్గొంటారని ఆయన చెప్పారు.