విశాఖలో జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను కోరారు. ఆంధ్రా యూనివర్సిటీలోని సాగరిక కన్వెన్షన్ హాలులో యోగా డే ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఒకే ప్రాంతంలో 5 లక్షల మందితో ఈ కార్యక్రమం నిర్వహింకానున్నామన్నారు.