అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నుండి గాజువాక ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రమణ బాబురావు (40) పాడేరు ఘాట్ లో సోమవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అతన్ని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.