ఈనెల 1న సమ్మెపల్లిలో జరిగిన చంద్రబాబు సభలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరిన ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మాధవ్ ను అక్రమంగా అరెస్టు చేశారని, తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి కె. రాజశేఖర్ డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలోకి రాగానే మరో విధంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదని విమర్శించారు.