అనంతగిరి మండలంలోని మిర్తిదుంగాడలో ఆశా కార్యకర్త రాములమ్మ గర్భిణులకు బాలింతలకు మంగళవారం కిల్కారి కాల్స్ పై అవగాహన కల్పించారు. బాలింతలు గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన ఆహార నియమాలు వైద్య పరీక్షలు తదితర అంశాలపై కిల్కారి కాల్స్ ద్వారా వినిపించారు. కిల్కారి కాల్స్ సందేశాలు గర్భిణులు పాలిచ్చే తల్లులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సూపర్వైజర్ లక్ష్మి క్లస్టర్ కో. ఆర్డినేటర్ అప్పలకొండ ఉన్నారు.