అనంతగిరి మండలంలోని చెరుకుబిడ్డ పరిసర ప్రాంతాల్లో తేలిక పాటి చిరుజల్లులు కురుస్తోంది. వారం రోజులుగా మండుటెండలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరై విలవిల్లాడుతున్న ప్రజలకు మంగళవారం 12 గంటల సమయంలో ఒక్కసారిగా కురుస్తున్న జల్లులతో ఉపశమనం పొందారు. కురుస్తున్న తొలకరి వర్షంతో పోడు వ్యవసాయంలో భాగంగా ఏడాది వేసిన వరి, సామా, కందులు వంటి పంటలకు ఎంతో మేలు చేస్తుందని ఆయా గ్రామాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.