చింతపల్లి: బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత

57చూసినవారు
చింతపల్లి: బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత అని ఎంపీడీవో యువిఎస్. శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం చింతపల్లి మండలంలోని ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ వెంకటరమణి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాల్యవివాహాలు చిన్నారుల జీవితలపై తీవ్రమైన ప్రభావం చూపే పెద్ద సమస్య అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా ముందుకు రావాలని కోరారు.

సంబంధిత పోస్ట్