చింతపల్లి: భారీ వర్షంతో సిసి రోడ్డుపైకి వరదనీరు

52చూసినవారు
చింతపల్లి మండల పరిసర ప్రాంతంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు ఉపశమనం లభించింది. కాగా కురిసిన భారీవర్షం కారణంగా చెత్తాచెదారాలతో డ్రైనేజీలు మూసుకుపోయాయి. దీంతో వరద నీరు నీరంతా కుమ్మరివీధి సీసీ రోడ్డుపై రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను అధికారులు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్