చింతపల్లి మండలంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. మండలంలోని లోతుగెడ్డ పిహెచ్సిలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవిడర్ గా పనిచేస్తున్న గసాడి. రమ్యశ్రీ(23)అనారోగ్యంతో బాధపడుతుండగా విశాఖ చెస్ట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం తుదిశ్వాస విడిచింది. దీంతో లోతుగెడ్డలో విషాదఛాయలు అలుముకున్నాయి. రమ్యశ్రీ మృతికి లోతుగెడ్డ ఆస్పత్రివైద్యులు లక్ష్మీకాంత్ శివప్రసాద్, ఆసుపత్రి సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.