చింతపల్లి మండలంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు నూతన ఎస్ఐలుగా వై. చైతన్య, ఎన్. రాంబాబు నియమితులయ్యారు. ఈ మేరకు చింతపల్లి ఎక్సైజ్ ఎస్ఐ జే. కూర్మారావు సమక్షంలో వారు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల విశాఖ జిల్లాలో జరిగిన బదిలీలో భాగంగా వీరిద్దరిని చింతపల్లి శాఖకు బదిలీ చేయడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. నాటుసారా నిర్మూలనకు కృషి చేయాలని ఎస్ఐ కుర్మారావు నూతన ఎస్ఐలకు సూచించారు.