చింతపల్లి మండలంలోని అంతర్ల గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు శుక్రవారం ఖాళీ బిందెలతో మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ. అంతర్ల గ్రామంలో నెల రోజులుగా ఇంటింటా కొళాయిల్లో నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. దీంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. తక్షణమే తాగునీటి సమస్య పరిష్కరించకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.