చింతపల్లి మండలంలోని చింతపల్లి పంచాయతీ పరిధి పెద పైపులైనువీధిలో సర్పంచ్ దురియ. పుష్పలత ఆదేశాల మేరకు పంచాయితీ సిబ్బంది మంగళవారం వీధి దీపాలు ఏర్పాటు చేశారు. కురుస్తున్న అకాల గాలి వానకు విద్యుత్ దీపాలు పోయాయని దీంతో నూతన వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరిగిందని సర్పంచ్ పుష్పలత తెలిపారు. దీంతో పెదపైపులైను వీధిలో చీకటి కష్టాలు తీరాయని తెలిపారు.