గోదావరి వరద దేవీపట్నం మండలంలో తీవ్రంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నానికి గండి పోచమ్మ తల్లి ఆలయంలోకి వరద నీరు భారీగా ప్రవేశించడంతో అమ్మవారి విగ్రహం సగం వరకు మునిగిపోయిందని దేవస్థాన ఈవో లక్ష్మీ కుమార్ తెలిపారు. భద్రాచలం ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుందని అధికారులు చెప్పారు.