పాడేరు మండలం ఈదులపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి టి. విశ్వేశ్వరనాయుడు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పీహెచ్‌సీకు వచ్చే రోగులతో ఆసుపత్రి నుంచి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీసారు. పీహెచ్‌సీ పరిధిలో గత నెలలో రక్తపరీక్షలు నిర్వహించగా, 20 మందికి మలేరియా ఉన్నట్లు నిర్దారణ అయినట్లు వైద్యాధికారి డీఎంఅండ్‌హెచ్‌వోకు వివరించడంతో వారికి అందుతున్న వైద్యసేవలు గురించి ఆరా తీశారు.