పాడేరు: సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి

0చూసినవారు
పాడేరు: సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి
రెగ్యులర్ ఏఎన్ఎంల మాదిరిగానే రెండవ ఏఎన్ఎంలు కష్టపడుతున్నారని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్య పడాల్ డిమాండ్ చేశారు. ఆదివారం పాడేరులో జరిగిన రెండవ ఏఎన్ఎంల సమావేశంలో పాల్గొన్నారు. రెండవ ఏఎన్ఎంలు గత 15ఏళ్లుగా మారుమూల గిరిజన గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. కానీ జీతాలు పెంచడం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఎలవెన్సులు ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్