జి. మాడుగుల మండలంలోని శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. జి. మాడుగుల నుంచి కుంబిడిసింగి వైపు వెళ్తున్న బొలెరో అదుపుతప్పి కుంబిడిసింగి వద్ద కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ క్లీనర్ సురక్షితంగా పడడంతో అంతాఊపిరి పీల్చుకున్నారు. కుంబిడిసింగికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కుంబిడిసింగి గిరిజనులు వాపోతున్నారు.