జి. మాడుగుల మండలంలోని జి. మాడుగులకు ఇటీవల వి. మాడుగుల నుంచి బదిలీపై వచ్చిన పంచాయతీ కార్యదర్శి వరహాలనాయుడుకి ఎంపీపీ అప్పలరాజు సర్పంచ్ రత్నకుమారి ఆధ్వర్యంలో ఘనంగా శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీపీ అప్పలరాజు మాట్లాడుతూ, గ్రామాల్లోని అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. గ్రామ ప్రజలతో మమేకమై గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమపథకాలు సకాలంలో అందేలా చూడాలని కోరారు.