తల్లికి వందనం నిధులు జమ కావడంతో జి. మాడుగుల మండలంలోని కొరపల్లి గ్రామానికి చెందిన కోర. కృష్ణంనాయుడు రాజ్ కుమారి దంపతులు ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తమ ముగ్గురి పిల్లలకు తల్లికి వందనం నిధులు జమా చేయడంతో సంతోషం వ్యక్తం చేశారు. వైసిపి హాయంలో అమ్మ ఒడి ఒకరికే ఇవ్వగా కూటమి ప్రభుత్వం ముగ్గురు పిల్లలకు ఇచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు.