జి. మాడుగుల: కుంబిడిసింగి గిరిజనుల కల్వర్టు కష్టాలు తీర్చండి

72చూసినవారు
జి. మాడుగుల: కుంబిడిసింగి గిరిజనుల కల్వర్టు కష్టాలు తీర్చండి
జి. మాడుగుల మండలంలోని కుంబిడిసింగికి వెళ్లే వాగుపై కల్వర్టు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. కురుస్తున్న వర్షాలకు వాగుపై కల్వర్టు లేక వాగుపొంగి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. వాగుపై కల్వర్టు నిర్మించాలని అధికారులకు ఎన్నోసార్లు విన్నవించిన పట్టించుకోలేదు. దీంతో గురువారం గ్రామ గిరిజనులు ఏకమై వాగుపై సొంతంగా రాళ్లతో, కల్వర్టు నిర్మాణం చేపట్టారు. అధికారులు స్పందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్