జి. మాడుగుల మండలంలోని గెమ్మెలి పంచాయతీ పరిధి లూవపల్లి గ్రామానికి గిరిజనులు ఆదివారం సొంతంగా రహదారి నిర్మాణం చేపట్టారు. రహదారి నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఎన్నోసార్లు విన్నవించిన పట్టించుకోకపోవడంతో గ్రామ గిరిజనులంతా ఏకమై మహాదేవపురం నుంచి లూవపల్లి వరకు మట్టిరోడ్డు నిర్మాణం చేపట్టామని వాపోతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి రహదారి నిర్మించి తమ రవాణా కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.