జి.మాడుగుల: 19 కేజీల గంజాయితో పట్టుబడ్డ ఇద్దరు
By Harshitha 81చూసినవారుజి. మాడుగుల మండలం జి. ఎం. కొత్తూరు వద్ద పోలీసుల వాహనాల తనిఖీల్లో గంజాయితో ఇద్దరు పట్టుబడ్డారని ఎస్ ఐ షణ్ముకరావు తెలిపారు. సోమవారం ఉదయం జీ. ఎం. కొత్తూరు జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద ప్యాకింగ్ చేసిన 19 కేజీల గంజాయి బయటపడిందన్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు, ద్విచక్రవాహనంను సీజ్ చేశామన్నారు.