జీకే. వీధి: కమ్మరితోటలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం

66చూసినవారు
జీకే. వీధి: కమ్మరితోటలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం
గూడెంకొత్తవీధి మండలంలోని దారకొండ పంచాయతీ పరిధి కమ్మరితోట గ్రామంలో ఆశా కార్యకర్త కాంతమ్మ ఆధ్వర్యంలో శుక్రవారం గిరిజనులు డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని వాటర్ ట్యాంకు చుట్టుపక్కల కాలువల్లో చెత్తా, చెదారం, మురుగును తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్త కాంతమ్మ మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలన్నారు. ఇంటి పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్