గూడెంకొత్తవీధి మండలంలోని వంచుల పంచాయతీ పరిధి ఎల్లవరం నుంచి కుట్టువీధి వరకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం ద్వారా 10 కిలోమీటర్ల తారురోడ్డు నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ పంచాయతీ అధ్యక్షుడు మధుకుమార్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రఘువంశి విజయ కుమారి దేముడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.