గూడెంకొత్తవీధి మండలంలోని గూడెంకొత్తవీధి పంచాయతీలో మంగళవారం జనసేన పార్టీ నూతన పంచాయతీ కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడుగా గడుతూరి. పరమేశ్వరరావుని ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఉపాధ్యక్షులు నర్సింగరావు, సూరిబాబు ప్రధాన కార్యదర్శిగా రాంబాబు, కార్యదర్శిగా కృష్ణను ఎన్నుకున్నారు. అధ్యక్షుడు పరమేశ్వరరావు మాట్లాడుతూ. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.