గూడెంకొత్తవీధి మండలంలోని చింతపల్లి క్యాంపులో ఇద్దరి బామ్మర్దులను హత్య చేసిన నిందితుడు వంతల. గెన్నును ఎట్టకేలకు మంగళవారం అదుపులో తీసుకున్నట్లు సీఐ వరప్రసాద్ తెలిపారు. పరారీలో ఉన్న గెన్నును ఫిల్టర్ కార్యాలయం సమీపంలోని కొండ ప్రాంతం పొదలలో దాగి ఉన్నాడన్న సమాచారంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అదుపులో తీసుకున్నమన్నారు. నిందితుడు గెన్నును బుధవారం రిమాండ్కు తరలించి కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐ తెలిపారు.