అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్లో సోమవారం రాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి పాడేరులో వేడి వాతావరణం ఉన్నప్పటికీ సాయంత్రం చల్లని వాతావరణంగా మారింది. పాడేరు ఘాట్ రోడ్డులో మాత్రం భారీ వర్షం కురిసింది. ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు వర్షానికి కాస్త ఇక్కట్లు పడ్డారు. వర్షాలు సమయంలో కొండ చరియలు పడే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.