ఈ నెల 19 నుండి 28 వరకు పదవ తరగతి, ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ సప్లిమెంటరీ జరుగుతాయని, పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తీర్ణులు కావాలని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కమాల్ క్యాంపులు పేరిట ప్రథమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐదారు తరగతుల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.