కోటవురట్ల మండలంలోని కోడవటిపూడి ప్రాథమికోన్నత పాఠశాలను హైస్కూల్ గా ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసినట్లు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ యలమంచిలి శ్రీనివాసరావు గురువారం తెలిపారు. పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని గ్రామ సర్పంచ్ కోసూరు అప్పారావు, ఎంపీటీసీ సూర్యప్రకాష్ పేర్కొన్నారు. ముఖ్యంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తామన్నారు.