లింగాపురంలో ప్రత్యేక వైద్య శిబిరం

61చూసినవారు
లింగాపురంలో ప్రత్యేక వైద్య శిబిరం
కొయ్యూరు మండలంలోని చిట్టెంపాడు పంచాయతీ పరిధి లింగాపురంలో డౌనూరు పిహెచ్సి వైద్యాధికారిణి ఎంఎం. కె. లలిత ఆదేశాల మేరకు మంగళవారం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సూపర్వైజర్ అప్పలనాయుడు పాల్గొని పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే పీహెచ్సికి రావాలని తగిన పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ఇందులో ఏఎన్ఏంలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్