ముంచింగిపుట్టు మండలంలో బైక్ పై తరలిస్తున్న 10 కేజీల గంజాయి సీజ్ చేసి ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ఎస్ఐ ఇచ్చిన సమాచారం ప్రకారం, ఎస్. ఐ. సిబ్బంది శనివారం ముంచింగిపుట్టు మండలం, జోలపుట్ పుట్టు పంచాయతి లబ్బూరు జంక్షన్ వద్ద తనిఖీల్లో ఒక ద్విచక్ర వాహనాన్ని ఆపారు. బండి క్యారేజీలో 10 కేజీల గంజాయి మూట కనిపించిందని ఈ గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను, రెండు సెల్ ఫోన్ లను, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.