ఈ నెల 24, 25, 25వ26వ తేదీల్లో విశాఖలో జరిగే ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సూర్యారావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆనంద్ కోరారు. ఈ మేరకు మహాసభల గోడపత్రికలను పాడేరు సీఐ దీననంధుదీననాథ్ చేతుల మీదుగా శనివారం ఆవిష్కరించారు. ఏబీవీపీ మహాసభల్లో రాష్ట్రంలో ఉన్న పలు విద్యా రంగ సమస్యలపై చర్చలు జరిపి, సమస్యల పరిష్కారం తదితర అంశాలపై తీర్మానాలు చేయడం జరుగుతుందని నాయకులు తెలిపారు.