మానవ అక్రమ రావాణాకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరీ నిర్మూలనపై విజిలెన్స్ మరియు మోనిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెట్టి చాకిరీ నిర్మూలనపై అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పారు. జిల్లా నుండి ఇతర జిల్లాలకు పనులకు వెళ్లే కార్మికులను గుర్తించాలని ఆదేశించారు.