కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దర్తీ అభా జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పై గిరిజనులకు అవగాహన కల్పించాలని ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి ఎం. వేంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఐటిడిఏ వీడియో కాన్ఫరెన్సు హాలులో వైద్య ఆరోగ్యశాఖ, గ్యాస్, పంచాయతీ రాజ్, ఎంపిడిఓలు, తాహశీల్దారులు, ఐసిడి ఎస్, జిసిసి, వ్యవసాయ శాఖ, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో దర్తీ ఆభా జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకం అమలుపై సమావేశం నిర్వహించారు.