పెదబయలు మండలంలోని జామిగుడ పంచాయతీ పరిధి జడిగుడలో 2024 సంవత్సరంలో పిడుగుపాటుకు గురై మృతి చెందిన కిల్లో. నర్సింగరావు తల్లిదండ్రులకు అల్లూరి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద కలెక్టర్ దినేష్ కుమార్ మంగళవారం రూ. 10 వేలు నగదును అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. ఏ కుటుంబానికి ఇలాంటి సంఘటన జరగకూడదని ప్రభుత్వం తరఫున తక్షణ సాయం కింద రూ. 10 వేలు అందజేస్తున్నామన్నారు.