పాడేరు: పీఎం జన్మన్ గృహాల నిర్మాణానికి శంకుస్థాపన

72చూసినవారు
పాడేరు: పీఎం జన్మన్ గృహాల నిర్మాణానికి శంకుస్థాపన
పాడేరు మండలంలోని సలుగు పంచాయతీ పరిధి కప్పరమజ్జిలో పీఎం జన్మన్ గృహాలు నిర్మణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పాల్గొని ముందుగా గ్రామంలో ఉన్న దుర్గామాంబతల్లిని దర్శించుకున్నారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి పిఏం జన్మన్ గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు అప్పలకొండ పరమేశ్వరి కృష్ణ ఎంపీటీసీ మీనా హౌసింగ్ పిడి బాబు తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్