పాడేరు: కప్పరమజ్జిలో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

79చూసినవారు
పాడేరు: కప్పరమజ్జిలో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
పాడేరు మండలంలోని సలుగు పంచాయతీ పరిధి కప్పరమజ్జిలో బుధవారం 35 లక్షల సిడిపిఓ నిధులతో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ అప్పలకొండ ఎంపీటీసీ మీనా పాల్గొని కొబ్బరికాయలు కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. కప్పరమజ్జిలో సీసీ రోడ్డు లేక వర్షాకాలంలో ఇబ్బందులు పడేవారని సిసి రోడ్డు నిర్మాణంతో కష్టాలు తీరిందన్నారు. ఇందులో గ్రామస్తులు గంగరాజు తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్