వేసవిలో ఏజెన్సీ వారపు సంతల్లో షేడ్ నెట్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ ఆదేశించారు. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలో శుక్రవారం నిర్వహించిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇంచార్జి ఐటిడి ఏ పి ఓ, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, డి ఆర్ ఓ కె. పద్మలతతో కలిసి అర్జీదారుల నుండి 75 ఫిర్యాదులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ వడగాల్పులు తగల కుండా ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పారు.