గిరిజన సమీస్కృత అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా పాడేరు ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గోల్డెన్ జూబ్లీ స్థూపాన్ని ఐటిడిఎ పిఓ వి. అభిషేక్ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఐటిడి ఆధ్వర్యంలో అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు సద్వినియోగం చేసుకొని గిరిజనులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఐటిడిఏ కార్యాలయం గిరిజన అభివృద్ధికి 50 ఏళ్లు కృషి చేసిందన్నారు.