సంపూర్ణ ఆరోగ్యానికి యోగాసనం దివ్యౌషధమని ఐటిడిఏ ఇన్ ఛార్జ్ పిఓ, జెసి డా. ఎం. జె. అభిషేక్ గౌడ అన్నారు. ఆరోగ్యంగా జీవించడానికి యోగాసనాలను నిత్యం ఆచరించాలని పిలుపు నిచ్చారు. ఐటిడిఏ కార్యాలయం నుండి అంబేడ్కర్ కూడలి వరకు నిర్వహించిన యోగాంధ్రా ర్యాలీని సోమవారం ఆయన పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు యోగాపై అవగాహన కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్రా కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.