రైతులు అధిక దిగుబడులు సాధించే విధంగా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుండి వ్యవసాయాధికారులు, పశు సంవర్ధకశాఖ, ఉద్యానవన శాఖ, సెరీకల్చర్, ఎపి ఎం ఐ పి, ఎన్ ఎం ఐ, డ్వమా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయానుబంధరంగా అధికారులు సంయుక్తంగా ఆర్గానిక్ వ్యవసాయానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలాన్నారు.