పాడేరు మండల పరిసర ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ వేడిమి ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు గురువారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చి భారీ వర్షం కురవడంతో ఉపశమనం లభించింది. అయితే కురిసిన భారీ వర్షంతో తొలకరి విత్తనాలు వరి సామ రాగులు వేసేందుకు ఎంతో మేలు చేస్తుందని ఆయా గ్రామాల గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేశారు.