అరకు పాడేరు మండలాల్లో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణాలకు భూమి కేటాయించాలని రాష్ట్ర జీసీసీ ఛైర్మన్ కిడారి. శ్రావణ్ కుమార్ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిసి కోరారు. బుధవారం జిల్లా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆ వినతిలో అరకు పాడేరు మండలాల్లో వెంకటేశ్వర ఆలయాల నిర్మాణానికి 15 ఎకరాలు భూమితోపాటు పాడేరులో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి 10 ఎకరాల భూమి కేటాయించాలని కోరారు.