బాల్య వివాహాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం సుండ్రు పుట్టు అంగన్వాడీ కేంద్రంలో బాల్య వివాహాలు, బాలికల విద్య, పోషకాహారం, కెరీర్ గైడెన్సు, రుతు క్రమంలో తీసుకోవలసిన జాగ్రత్తలు కిశోరి వికాసంపై 11 ఏళ్ల నుండి 18 ఏళ్ల బాలికలకు నిర్వహించిన అవగాహన కార్యాక్రమంలో పాల్గొన్నారు. మే 2 నుండి జూన్ 10 వరకు కిశోరి వికాసరం కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.